విదేశీ డాక్టర్ విద్య అభ్యసించడానికి, 10 లక్షల ఆర్థిక సాయం - అఖిలభారత గౌడ సంఘం ఆధ్వర్యంలో
ఈరోజు 09-09-2021 రవీంద్రభారతిలో, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో అఖిల భారత గౌడ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారి ఆధ్వర్యంలో మంత్రి గారి చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కుని డాక్టర్ విద్య అభ్యసించడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులకు చెక్కును అందజేయడం జరిగింది రాచమల్ల పోతురాజు గౌడ్ గారి కుమారుడు డాక్టర్ ధన సత్యసాయి గౌడ్ మరియు కుమార్తె హారిక గౌడ్, ఉక్రెయిన్ (రష్యన్) దేశంలో ఒడిస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో M.D (General Medicine) చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బంది వల్ల ఫీజులు కట్టలేనీ స్థితిలలో అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు శివనాగేశ్వరరావు గౌడ్ గారిని సంఘం ద్వారా ఫీజుల కొరకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా వారి తండ్రి పోతురాజు గౌడ్ గారు కోరడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి చేతులమీదుగా అఖిలభారత గౌడ సంఘం ఆధ్వర్యంలో పెరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు మరియు అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గౌడ సంఘాల JAC-co చైర్మన్ కూరెళ్ళ వేములయ్య గౌడ్, గారు 10 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు గౌడ్, రిటైర్డ్ న్యాయమూర్తి బత్తిన వెంకట ప్రసాద్ గౌడ్ గారు, గౌడ సంఘం నాయకులు సానం ప్రవీణ్ కుమార్ గౌడ్, జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, రాష్ట్ర కోశాధికారి పల్లె శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బియ్య గూడెం శ్రీలత గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు గుర్రం మంజుల గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ కుమార్ గౌడ్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బంధారం అనిల్ గౌడ్, దూపటి
ఏలెందర్ గౌడ్, గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్
నల్లమాస రాజేష్ గౌడ్, రోహిత్ గౌడ్ అఖిల్ గౌడ్, మరియు గౌడ సంఘాల నాయకులు అమరవేరి నర్సాగౌడ్ రాగుల కిరణ్ గౌడ్,
మాధవి గౌడ్, బొంగు రఘు గౌడ్, వీరమల్ల దేవేందర్ గౌడ్, దీపాదేవి గౌడ్, తదితర గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.